మా గురించి

తెలంగాణ రాజ్యాధికార పార్టీ

తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరులోనే ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతమైన, ప్రజాస్వామ్య పద్దతులలో ప్రజా ఉద్యమాలను నడిపిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసే భాద్యతను నిర్వహిస్తూనే మరొకవైపు స్థానిక సంస్థల నుంచి అన్ని ఎన్నికలలోనూ పోటీ చేస్తూ ప్రజల ఓట్ల మద్దతుతో ప్రజా ప్రభుత్వమును స్థాపించటానికి కృషి చేస్తుంది. అట్టడుగు వర్గాలకు అధికారం అందించటంతో పాటు ఇప్పటి వరకూ స్థానిక, రాష్ట్ర, కేంద్ర స్థాయి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో మరియు నిర్ణయాలు తీసుకునే స్థాయి కమిటీలలో ప్రవేశం దొరకని అట్టడుగు వర్గాల ప్రజలకు ఆ స్థానాలను అందించటానికి కృషి చేస్తుంది.

ప్రజలలో చైతన్యాన్ని వ్యాప్తి చెయ్యటం, అన్యాయానికి, వివక్షకు వ్యతిరేకంగా గళాన్ని వినిపించటం, అణగదొక్కబడుతున్న ప్రజల యొక్క హక్కులను సంరక్షించటం ఈ ప్రజా ఉద్యమం యొక్క లక్ష్యం. ఎన్నికలలో పోటీ చేసి గెలుపొంది అధికారాన్ని సాధించటం ద్వారా చట్టాలలో, ప్రభుత్వ విధానాలలో, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలలో అసలైన మార్పుని తీసుకువచ్చి ప్రజల యొక్క జీవన విధానాలను వివిధ పద్దతులలో, రూపాలలో మెరుగుపరచడం ఈ ప్రజా ఉద్యమం ఉద్దేశ్యం.

నేపథ్యం మరియు ఉద్దేశ్యం

తెలంగాణ ప్రజా ఉద్యమం అనేది ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కొరకు మొదలైన ఉద్యమం. నాయకత్వం, నాయకులు ఈ ఉద్యమాన్ని విస్మరించారు. తెలంగాణలో చైతన్యవంతులైన యువకులు, ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తరువాత కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. సామజిక తెలంగాణ- ఈ రాష్ట్ర ఏర్పాటు, ఉన్నతి కోసం ఎన్నో ఎడతెగని పోరాటాలు చేసిన అట్టడుగు వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. మన పార్టీ భౌగోళిక తెలంగాణాను మాత్రమే సాధించుకున్నాం సామాజిక తెలంగాణ ఇంకా సాధించుకోవలసే ఉన్నది అని విశ్వసిస్తోంది. తెలంగాణ ఏర్పడిన గత పదేళ్ల కాలంలో అట్టడుగున ఉన్న - మెజారిటీ వర్గాలు (బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలు మరియు ఇతర పేదలు) ఆధునిక జీవితంలోని అన్ని రంగాలలో కనుమరుగవుతున్నారు మరియు కొన్ని సంపన్న వర్గాల ఆధిపత్యం వలన అనేక అన్యాయాలకు గురవుతున్నారు. కాబట్టి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సాధించేందుకు శాంతియుత, అహింసా, ప్రజాస్వామ్య పరివర్తన అవసరం. సామాజిక తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కోసం మన పార్టీ పని చేస్తుంది. అలాగే, మన సమిష్టి కృషి ద్వారా, వైవిధ్యాలకు విలువనిచ్చే, సమానత్వం మరియు అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లే సమాజ నిర్మాణం కోసం, సామాజిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించటం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రయత్నిస్తుంది.

మన నాయకుడు - తీన్మార్ మల్లన్న

ఎదురెవరున్నా భయంలేకుండా బీసీలకు గౌరవం, న్యాయం, నిజమైన రాజకీయ అధికారం కోసం నిలబడే నాయకుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో సాహసోపేతమైన కార్యాచరణలు చేసినవాడు. అట్టడుగు వర్గాల యొక్క ఉన్నతికి నడుము కట్టినవాడు. సమాజంలో నెలకొన్న పరిస్థితులను సవాలు చేయాలని మరియు అట్టడుగు వర్గాలను ఉద్ధరించడానికి నిశ్చయించుకున్నవాడు.

తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వెనుకబడిన తరగతుల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను, అన్యాయాలను ఎత్తిచూపూతూ తన గొంతునే ఆయుధంగా వాడి శక్తివంతమైన నాయకుడిగా ఉద్భవించాడు. ఒక జర్నలిస్టుగా వ్యవస్థాగత నిర్లక్ష్యం మరియు రాజకీయ అవకతవకలు బీసీలను పాలనలో ఎలా శక్తిహీనులుగా చేశాయో వెలుగులోకి తెచ్చారు. అతని నిర్భయ కార్యాచరణ అతన్ని ప్రజా నాయకుడిని చేసింది, అట్టడుగు వర్గాల వారు విస్మరించబడినప్పుడు వారి గొంతుకగా ప్రతిధ్వనించారు.

రాజకీయాల్లోకి అడుగుపెట్టే క్రమంలో విస్మరించబడుతున్న బీసీ వర్గాల ప్రాతినిధ్యం కోసం బలమైన న్యాయవాదిగా మారారు. పారదర్శక పాలన, సామాజిక న్యాయం మరియు నిజమైన సాధికారతపై దృష్టి సారించారు. రాష్ట్రంలో బీసీల జనాభా బలాన్ని నిర్ణయాత్మక రాజకీయ అధికారంగా మార్చడం మరియు దశాబ్దాల వ్యవస్థాగత దోపిడీని అంతం చేయడం మల్లన్న లక్ష్యం. తీన్మార్ మల్లన్న దృష్టి రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీ పౌరుడు గౌరవంగా, సమాజంలో సమానమైన అవకాశాలతో మరియు వారి భవిష్యత్తును నిర్మించుకంటూ స్వశక్తితో జీవించగలిగే తెలంగాణను సృష్టించడం పైనే కేంద్రీకృతం అయి ఉంది.

తీన్మార్ మల్లన్న నాయకత్వంలో ధైర్యం, ఐక్యత, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడే అచంచలమైన నిబద్ధత ఉన్నాయి.

విజన్

ప్రజలకు భయంలేని, ఆకలిలేని, అవినీతిలేని, పక్షపాతంలేని సామాజిక తెలంగాణను, ప్రజలతెలంగాణను సాధించటం. అభివృద్ధికి నోచుకోని అట్టడుగు వర్గాలైన బీసీ, ఎస్.సి,ఎస్ .టి, మైనారిటీ, పేదప్రజలను రాజకీయఅధికారంలో, సమగ్ర అభివృద్ధిలో భాగస్వామ్యులను చేసే బాధ్యతాయుతమైన పరిపాలనను అందించటం.

మిషన్

ఒక రాజకీయ పార్టీగా స్థానిక సంస్థల ఎన్నికల నుంచి శాసనసభ, పార్లమెంట్ వరకూ అన్ని ఎన్నికలలోనూ పోటీచేస్తాం. ఎన్నికలలో పెరుగుతున్న డబ్బు ప్రభావాన్ని ప్రజలలోకి తీసుకెళుతూ డబ్బు అవసరంలేని ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలను చూపిస్తూ సమాజం మీద భాద్యత, ప్రేమ కలిగిన యువతను నాయకులుగా మలిచేందుకు ఒక అద్భుతమైన వేదికగా మన పార్టీ పనిచేస్తుంది. సామాజిక చర్యగా, జనాభా ఎక్కువగా ఉండి కూడా అభివృద్ధికి నోచుకోని అట్టడుగు వర్గాల మధ్య ఐకమత్యాన్ని నిర్మిస్తూ అన్ని రంగాలలోనూ వారికి రావలసిన సమాన ప్రాతినిథ్యాల మీద, వనరుల మీద, తరతరాలుగా వారికి జరుగుతున్న అన్యాయాల మీద అవగాహన కల్పిస్తూ ఆ అన్యాయాలను ఒక సందర్భంలో లేదా మరొక సందర్భంలో పరిష్కరిస్తుంది.

నాయకత్వం

నాయకత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రధాన మానవీయ విలువలు మరియు సమిష్టి నిర్ణయం తీసుకోవడం, విధాన అమలు ప్రక్రియలకు కట్టుబడి ఉంది అలాగే సామాజిక న్యాయం కోసం నిలుస్తుంది మరియు ప్రజలకు అధికారాన్ని నమ్ముతుంది. వివిధ ప్రగతిశీల సామాజిక ఉద్యమాలు, మీడియా, ఎన్‌జిఓలు, విద్యావంతులైన నిపుణులు ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన యువత మరియు మహిళల నుండి నాయకత్వం తీసుకోబడింది.

మన ఐడియాలజీ

మన పార్టీ యొక్క బలము మరియు ఐడియాలజీ రెండూ కూడా భారతీయ రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతం మరియు థీసిస్ నుంచే పొందుపరచబడ్డాయి. భారత రాజ్యాంగములోని ప్రధానమైన విలువలను జనసామాన్యంలోకి తీసుకువచ్చి వాటినే ఆధారంగా చేసుకుని మన పార్టీ భావజాలమును నిర్మించటం జరుగుతుంది.

మన విలువలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీ బిసి వర్గాలకు నిజమైన ప్రాతినిథ్యం కోసం ఆవిర్భవించింది.

సాధికారత

పేపర్ మీద ప్రాతినిధ్యం మాత్రమే కాదు, పాలనలో నిజమైన అధికారం.

ఆత్మగౌరవం

శతాబ్దాలుగా అణచివేతపై పోరాడిన బీసీ నాయకుల అడుగుజాడల్లో.

ఐకమత్యం

అన్ని BC ఉపకులాలు మరియు మతాలు ఒక బలమైన రాజకీయ వేదిక క్రిందకి.

పారదర్శకత

ప్రతి సంక్షేమ పథకానికి, ప్రతి నిధుల కేటాయింపుకు పూర్తి స్థాయిలో లెక్కలు చూపుతారు.

సామాజిక న్యాయం

విద్య, వైద్యం, భూమి మరియు రాజకీయ అధికారంలో సమాన అవకాశాలు.

ధైర్యం మరియు సంకల్పం

వ్యవస్థాగతమైన వెలి, మోసాలపై నిర్భయమైన ఉద్యమాలు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ చరిత్ర

ప్రతిఘటన మరియు త్యాగం యొక్క వారసత్వం

తెలంగాణలో వెనుకబడిన తరగతుల పోరాటం సుదీర్ఘమైనది మరియు స్ఫూర్తిదాయకం. కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే నుంచి తెలంగాణ తొలి అమరవీరుడు అయిన దొడ్డి కొమురయ్య వంటి స్థానిక వీరుల వరకు బీసీ ఉద్యమం ఎప్పుడూ ధైర్యం, ప్రతిఘటనతో నడుస్తూనే వుంది.

కీలకమైన చారిత్రక మైలురాళ్లు:

నిజాం అణచివేతకు వ్యతిరేకంగా బీసీ నాయకుల నేతృత్వంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం. తెలంగాణా రాష్ట్రం కోసం, బీసీ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన శ్రీకాంతాచారి, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి నాయకుల ఆత్మబలిదానాలు.

బీసీ సాధికారత కోసం రాజకీయ మరియు సైద్ధాంతిక పునాదిని సృష్టించడంలో జస్టిస్ పుంజాల శివశంకర్ మరియు ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సహకారం. ఈ త్యాగాలు ఉన్నప్పటికీ, అగ్రవర్ణ రాజకీయ పార్టీలచే క్రమపద్ధతిలో అణచివేయబడుతున్న బీసీలకు తక్కువ ప్రాతినిధ్యం ఉంది. ఆ ప్రతిఘటన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరియు భవిష్యత్తు మెజారిటీకి చెందేలా ఈ పార్టీ నిర్మించబడింది.